టీచర్ పాఠం చెప్తోంది.అందరిలో మంచి చెడు ఉంటాయి కానీ మనం మంచిని గ్రహించి దాన్ని పూలపరిమళంలాగా వ్యాపింపజేయాలి." " టీచర్! నాకు అర్ధంకాలేదు" శివా అడిగాడు."రకరకాల కీటకాలున్నాయి.దేనివల్ల మనకి లాభం? ఏవి చెడును చేస్తాయి?"
టీచర్ అడగగానే" ఈగ దోమవల్ల రోగాలువస్తాయి.తేనెటీగ వల్ల తేనె వస్తుంది.అందుకే కష్టజీవి తేనెటీగ అంటే నాకు ఇష్టం టీచర్!" "గుడ్! జోరీగ ఆకలికి తేనెను జుర్రుతుంది. రసికారే పుండుపై కూడా వాలి దాన్ని పీలుస్తుంది.అలాగే మంచిమనిషి తేనెటీగ వంటివాడు.కేవలం పూలపై వాలి మకరందం సేవించి మనిషికి అందిస్తోంది.తనబాగు మాత్రమే చూసుకోడు మంచివాడు.ఇతరులకై శ్రమించి పరోపకారం చేసేవాడు తేనెటీగ. పైకి మంచితనం నటిస్తూ కుళ్లు,అసూయ, ద్వేషంతో రగిలేవాడు జోరీగ. వాడివల్లసమాజానికి చెడు జరుగుతుంది." పిల్లలంతా చప్పట్లతో "మేము తేనెటీగలం," అని అరిచారు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి