సుప్రభాత కవిత : - బృంద
అనంత విశ్వపు గదిలో
వెలిగే అఖండ దీపమై 
ప్రాక్పశ్చిమ దిశల నడుమ 
పయనించే కాలపు తేరై...

తూరుపు కొండలలో
రవ్వలు రాశి పోసినట్టు
గగన వనాన వెలుగుపువ్వు
కిసలయించినట్టు...

అల నీలి నింగి నుండి 
ఇలకు చేరే  తరుణ భాస్కర 
తొలి కిరణాల ధారలో 
పుడమి తడిసి మెరిసినట్టు..

వేకువను మధించి తెచ్చిన 
వెన్నెలను పోలిన వెలుగులో
వాకిట విరిసిన మందారమై
ముచ్చటగా  నవ్వినట్టూ...

లేత మనసులో కలుగు
మధుర భావనలు 
మూసిన రెప్పల వెనుక
స్వర్ణ స్వప్నమై తోచినట్టు..

దివిని కొలువున్న దైవగణము
భువిని కరుణించి పంపిన 
పీయూష కలశము తీరున
అవని దోసిట నిలిచిన ఆదిత్యునకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు