వసుంధర విజ్ఞాన వికాస మండలి (రిజిస్టర్డ్) ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కర్కముత్తారెడ్డి స్మారకార్థం గత కొన్నేండ్లుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వచన కవితల పోటీలు ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నాము. ఈ పోటీలకు గాను పదవతరగతి లోపు విద్యార్థినీ, విద్యార్థులు ఒక విభాగంగా, అన్నివయసుల వారు మరో విభాగంగా నిర్ణయించనైనది. ప్రతి విభాగం నుంచి 5 కవితల చొప్పున మొత్తం 10 ఉత్తమ కవితలకు నగదు బహుమతులు అందజేస్తాం.
పదవతరగతి లోపువారికి అంశం-: అనాధశ్రయాలకు అమ్మనాన్నలు
విద్యార్థులు ప్రస్తుతం పదవతరగతి లోపు చదువుతుండాలి.
వారి విద్యార్హతలు దృవీకరిస్తూ ప్రధానోపాధ్యాయుని సంతకంతో కూడిన లేటర్ తప్పనిసరి
అన్ని వయసుల వారికి అంశం : కుప్పకూలుతున్న ఆలుమగల అనుబంధాలు
కవిత మీ స్వంతం అనే హామీపత్రం తప్పనిసరి
రెండు విభాగాల్లో ఒకరు ఒక కవిత మాత్రమే పంపాలి.
ప్రతి కవిత 20 నుంచి 30 లైన్లలోపు మాత్రమే ఉండాలి (దీర్ఘకవితలు స్వీకరించం)
కవితలు పోస్టుద్వారా మాత్రమే పంపించాలి. ఇతరాత్ర కవితలు స్వీకరించబడవు
పోటీల నిర్వహణ, రద్దు విషయాల్లో తుదినిర్ణయం సంస్థదే
కవితలు పంపాల్సిన చివరితేది 25.02.26
కవితలు పంపాల్సిన చిరునామా : కన్వీనర్, వసుంధర విజ్ఞాన వికాస మండలి (రిజిస్టర్డ్), ఇ,నెం- : 13-3/3/6/2E, అవంతినగర్ తోట, మోతీనగర్, హైదరాబాద్ -500018. సంప్రదించాల్సిన పోన్ నెంబర్ 8096677409.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి