విచక్షణతో విజయాన్ని సాధించు: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
సమాజ హితమే మా ధ్యేయమని
మేమున్నది మీ బాగు కొరకే అని
సేవా ధృక్పదమే మా లక్ష్యమని
మిమ్మల్ని ఉద్ధరించటయే పరమార్థమని

ఆకర్షణ పధకాలను ప్రవేశపెట్టి
ఉచిత పథకాలతో ప్రలోభపెట్టినా
ఓటుని నోటుకు అమ్ముకోక
పరమాత్ముడిచ్చిన యుక్తాయుక్త విచక్షణతో
మహానీయుల త్యాగఫలితమే భరతావని అని

ప్రజాశ్రేయస్సు కొరకు పాటుపడే
నిస్వార్థ, నిష్కళంక కులమతభేదాలకతీతంగ
పనిచేసే నాయకుని
ఓటుని సద్వినియోగం చేసి విజయాన్ని సాధిస్తే
గాంధీ మాహాత్ముడు కలలు కన్న
రామరాజ్యం తప్పక ఏర్పడుతుంది...!!
...........................

.........................

కామెంట్‌లు