చీకటి నిండిన రాతిరికి
వేకువ తెచ్చే వెలుగులే
కలతలు దాటే దారిని
కనులకు తోచగ చేసేను
మనసును నలిపే వెతలన్నీ
మనుగడ భారం కానీక
మరపులు మూసిన తెరలేవో
మాయం చేయగ వేచేను.
నమ్మిన సత్యం తప్పక
నడిపించును చేయిపట్టి
ఒరులెవ్వరు తీర్పగలేరు
కనిపించని కష్టాలు
మనుషులలో వచ్చే మార్పులు
మనుగడకే ముప్పుగాదా!
మరియాదలు మరచిన వారికి
తగు రీతిగా తగలదా!
మనలోపలి ఆలోచనలు
మనకన్నా బాగా తెలిసిన
విధి ఒక్కటి ఉంటుందే
అది సరదా తీర్చేయదా!
కొత్తగ తోచే జగమంతా
వింతగా మారెను మనసంతా
ఎంతటి వేదన ఎదురైనా
కొంతగ మార్చే తీరును రేపు!
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి