పోలయ్య కూకట్లపల్లి కవితా గానం: రవీంద్ర భారతిలో ఘన సన్మానం.
 ..సర్వజన సాహితీ సామాజిక సంస్థ తెలంగాణ ఆధ్వర్యంలో అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ రషీద్..కార్యదర్శి మోటూరి నారాయణరావు సారథ్యంలో మంగళవారం సాయంత్రం ప్రముఖ సైకియాట్రిస్ట్ నారాయణ పేటలో పుట్టిన అమెరికా డాక్టర్ "ముహమ్మద్ ఖుతుబుద్దీన్ గారి "జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ జరిగింది
ఆచార్య పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ పుస్తకావిష్కరణ చేయగా ప్రముఖ కవి రామ చంద్రమౌళి క్లుప్త సౌందర్యంగా పుస్తకాన్ని సమీక్షించారు
ఈ సందర్భంగా దీపక్ న్యాతి...అన్వర్ పాషా...దన్నారం శ్రీనివాస్ ...సమన్వయ 
కర్తలుగా నిర్వహించిన కవి సమ్మేళనంలో హైదరాబాద్ అత్తాపూర్ నివాసి ప్రముఖ కవి రచయిత నటుడు పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని "మందు ఒక్కటే మానవత్వం" 
కవితను గానం చేస్తూ...
"అరిషడ్వర్గాలనే
అంతర్గత దుర్గుణాలతో
మనిషి మలినమైపోతున్నాడు
ఆ దుర్గుణాలు అంతరంగాన
ఎగిసేపడే ఆరని అగ్నికణాలు...
"నేడు
ఎటువైపు చూసినా
స్వార్థం కులం బలం
అహంకారం
ఆశ్రిత పక్షపాతాలే
రాజ్యమేలుతున్నాయి...
"కుట్రలతో కుతంత్రాలతో
పగాప్రతీకారాలతో
అసూయాద్వేషాలతో...
"ధనదాహంతో
పదవీ వ్యామోహంతో విర్రవీగుతూ
అక్రమాలకు పాల్పడుతూ మనిషి
అవినీతి ఊబిలో కూరుకుపోతున్నాడు...
"అశాంతితో రగిలిపోతున్నాడు
దుష్ట తలంపులతో బ్రష్టుడైపోతున్నాడు...
కళ్ళు పొరలు కమ్మి కామంతో
మనిషి మృగంలా మారిపోతున్నాడు...
"బుద్దభూమిని యుద్ధభూమిగా మారుస్తూ
రాజ్యకాంక్షతో రక్తపుటేరులు పారిస్తూ
మనిషి రాక్షసుడై పోతున్నాడు...
"అందుకే అశాంతితో 
మనిషి కుమిలి పోతున్నాడు
దానికి "మందు ఒక్కటే మానవత్వం"...
ఔను ఓ మానవత్వమా
నీవెక్కడంటే.? ఆకలికి అలమటించే
అభాగ్యులను అనాధలను ఆనాదుకునే..
నిస్వార్థపరులైన ధర్మమూర్తుల
దాతృత్వపు గుణంలో...దాగి నేనక్కడంటోంది...మానవత్వం...
"ఔను దానవత్వాన్ని దహనం చేస్తే
మానవత్వం చిగురించే వసంతమే...
"అందుకే యుద్దవిమానాలతో
ఈ ధరణి దద్దరిల్లకుండా
ప్రతిచోటా ప్రశాంతత ప్రజ్వరిల్లేలా...
"ప్రతి మనిషి మనసునేలలో
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు
సమానత్వం సౌభ్రాతృత్వాలకు
పునాదులైన దయా జాలి కరుణలనే...
మానవత్వపు విత్తనాలను నాటుదాం...
ప్రతిగుండెలో ప్రేమపూలను పూయిద్దాం..
విశ్వమంతా శాంతికపోతాల్ని ఎగురవేద్దాం
అంటూ సందేశాత్మక కవితను వినిపించి ప్రముఖులచే ప్రశంసలు అందుకున్నారు
ఈ సభకు డాక్టర్ విడి రాజగోపాల్...
కాంతి కృష్ణ...గౌరీ శంకర్...మౌనశ్రీ మల్లిక్... అంజనీ కుమారి...తదితర సాహితీ మూర్తులు హాజరై డాక్టర్ ముహమ్మద్ ఖుతుబుద్దీన్ ఒక మానవతా వాది అని వారి జీవితం నేటి యువతకు రేపటితరాల వారికి స్పూర్తిదాయకమని కొనియాడారు
తదనంతరం అతిథులకు కవితా గానం చేసిన కవులను కవయిత్రులకు ఆత్మీయ సత్కారం జరిగింది.
డాక్టర్ ముహమ్మద్ ఖుతుబుద్దీన్...
డా.వి డి రాజగోపాల్... సాధనాల...మొహమ్మద్ అబ్దుల్ రషీద్ పోలయ్య కవి కూకట్లపల్లిని అందమైన శాలువాతో... చక్కని జ్ఞాపికతో... విలువైన పుస్తకంతో... ఘనంగా సన్మానించారు... పోలయ్య కవి కూకట్లపల్లి అందరికీ ప్రత్యేకంగా అబ్దుల్ రషీద్ భాయ్ కి కృతజ్ఞతలు తెలిపారు . 

కామెంట్‌లు