కలల స్వప్నమా ఓ ఆకాశవాణి : - డా. ధనాశి ఉషారాణి-ప్రముఖ రచయిత్రి -తిరుపతి జిల్లా భాకరాపేట
 కనులు ముందు నా గుండెను బొమ్మరిల్లును చేసి 
ఆకాశమే  హద్దుగా ఆనందాన్ని పంచేవు
అలసిన నా గుండెని నీ అమృతపు మాటలతో సేద తీర్చేవు 
అరవిచ్చిన తియ్యని ఉషోదయమై ఆనందాన్ని పంచేవు 
సమస్త ప్రపంచాన్ని నా ముంగిలిలో నిలిపేవు
 శృతిమెత్తనీ తరంగపు జల్లులతో 
మదిని ముస్తాబు చేశావు
అవధులే లేని విజ్ఞానమును  నిత్యము పంచేవు 
అమ్మతనం పంచేటి ఓ అమృత బాండమా 
కర్షకులను కనులు విందు చేసేటి
ఓ చంద్రవదనమా 
జగమంతా నిండి ప్రతిమదిని తాకే ఓ ప్రణయరాగమా 
అందుకో మా సమస్తజనుల నిత్య నీరాజనాలను
=======================================

రేపు ఫిబ్రవరి 13 తేదీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా 
కామెంట్‌లు