మనసు పడే తాపత్రయం:- ఈగపాటి రంజాన్ -భద్రాద్రి కొత్తగూడెం
 కొన్ని సంవత్సరాల క్రితం నా మనసుకు తగిలిన గాయం 
నేటికి మనని వైనం 
తపన పెడుతుంది భవిష్యత్తును పునాదిగా చేసుకొని 
నా గుండెల్లో గూడు కట్టుకుంది మనసుకు మాత్రమే
 తెలిసే తీపి భాష ఏదో తెలియని తీపి బాధ ప్రేమ...
అప్పటి వరకు ఆకాశంలా నిర్మలంగా ఉన్న నా మనసు ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి 
అప్పటి వరకు ఉన్న తీపి బాధ మోయలేని బరువు పెరిగింది మనసులో మాట చెప్పేసరికి నా అందని కి ఉన్న రంగు అడ్డొచ్చింది నీపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదని చెప్పకనే చెప్పింది అమ్మ నాన్న ప్రేమకు ప్రతీరూపాన్ని నేనూ వారిచ్చిన ఈ అందమైన దేహంపై నా మనసుకి నచ్చిన చిన్నది ఆమే మెచ్చి నాకు ఇచ్చిన పెద్ద బహుమతి ఎప్పటికి మరువలేనిది మరపు రాకుండా కొట్టినా గాయంలా రక్తం గడ్డ కట్టినట్టు నా మనసు పై ఎవరికి కనిపించని గాయమై నేటికి గట్లనే నన్ను అటుపెట్టుకొని ఉంది ఆకట్టుకునే అందం కన్నా ఆకర్షించే గుణం ఎంతో మిన్న నా జీవితపు పుస్తకపు పేజీలో కొన్ని పేజీలో అక్షరాలు ప్రేమతో.....!!

కామెంట్‌లు