జై ఆదివాసి జై జై ఆదివాసి
జై మూలవాసి జై జై ఆదిమావాసి
భూమిని చీల్చుకు పుట్టిన విత్తనం ఆకుపచ్చ
భూదేవితో నిండిన ప్రకృతి వనం ఆకుపచ్చ
సిరి సంపదలతో గాదెలు నిండి తీరే ఆకుపచ్చ
సిరిసిరి సొగసుల నవ్వుల విరబోసే ఆకుపచ్చ
అన్నదాత పాడిపంటల బ్రతుకు జీవనం ఆకుపచ్చ
మూగజీవాల ఆకలి తీర్చే ఇంధనం పశువుల మేత ఆకుపచ్చ
జాతీయ జెండాలో మెరిసిన రంగులలో ఆకుపచ్చ
జగతి సిగలోన మల్లెల చాటున దాగిన ఆకుపచ్చ
అరణ్యంలో ఆదివాసి విప్లవ జండా ఆకుపచ్చ
అరణ్యంలో ఆదివాసి కొలిచే చెట్టు పుట్ట ఆకుపచ్చ
మేడారం సమ్మక్క సారక్కల పసుపు కుంకుమల
తోరణ ప్రతీక ఆకుపచ్చ
మాన్యంలో కోయ సంస్కృతి కొత్తల పండుగ ఆకుపచ్చ
అక్బర్ అల్లాఅంటూ ముస్లిం సోదరుల ప్రతీక ఆకుపచ్చ
అంతరాత్మ మనసు పొరల్ని ఉప్పొంగించు ఆకుపచ్చ
తొలి తెలుగు కవియిత్రి మొల్ల చీర ఆకుపచ్చ
కిలకిలమంటూ రామచిలకల అందమే ఆకుపచ్చ
తెలంగాణ బతుకమ్మ పేర్చిన పువ్వులలో ఆకుపచ్చ
తెలుగు తల్లి చేతిలో ఒదిగిన సిరి సంపద ఆకుపచ్చ
సీతమ్మ వారి మణి హారంలో మెరిసిన ఆకుపచ్చ
నెమలి వయ్యారంలో సింగారమే నాట్యమాడిన ఆకుపచ్చ
ఊరించే ఉగాది పండుగలో స్వాగతం పలికే ఆకుపచ్చ
ధరణిలో ప్రతిజీవి బ్రతుకు జీవన గమనమే ఆకుపచ్చ
ప్రేమను పంచే ప్రతి హృదయంలో దాగిన ఆకుపచ్చ
పీల్చే వాయువు ఆయువుకు ప్రాణం ఆకుపచ్చ
అందుకేనేమో నా మనసు దోచెను ఆకుపచ్చ
రెపరెపలాడే ఆదివాసి జెండా గుండె నిండా ఆకుపచ్చ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి