బుట్టితి నష్ఠ జాతకుడ....
నాకును తండ్రికి గండము
మోసుకొచ్చితిన్...!
ఇల్లును, ఒళ్లును గుళ్ల యాయె నట...!
చచ్చి బ్రతికితిమి తండ్రి, కొడుకులమిరువురమును
బాల్య మంతయు బాధల మయ్యె....
ఆర్ధిక బాధలకు ఆరోగ్య సమస్యలు తోడయ్యె న హ హా...!
తో టి వారితో కలిసి ఆడిన ఆటలలో ఆకలిని మరిచిన రోజు లవి ఎన్నో!
విధి వంచితముగ తండ్రి తాగు బోతు కాగ...
ఇంటిబరువు తల్లికి
భారమై పోగా....
హాయిగా బడికి పోయి చదువు కొనుటసాధ్యమ య్యె...!!
ఇల్లు , గాలికి చెల్లా చెదు రైన ధూలిగా మారె...!
పరిస్థితులు విద్యార్ధినైన నన్ను... ఆరణాల రోజు కూలి గా మార్చె...!
కష్ట,సుఖాలు...లాభ,నష్టాల ఎత్తు పల్లా లవి ఎన్నొ దాటి...,
విధి నడిపించు నటుల నడుచుకుంటు...
నేటికి డెబ్బది రెండవ మైలు రాయికి జేరితి...!!
ఇన్నిన్ని కలతలు, కన్నీళ్ళ కష్టాల గమనం లో...
యవ్వనపు లేపనమే కాస్త ఉపసమనము...!
మిత్రులు, సినిమాలు , వ్యసనాలు , షికార్లు....
యవ్వనపు అలజడికి
తడ బాట్లు , పొరపాట్లు !!
కిర్రె క్కించే నవలలతో మొదలైన పుస్తక పఠనం
రామాయణ,భారతాది అనేక అత్యుత్తమ గ్రంధా లు...అతివాద,మిత వాద సిద్ధా0త గ్రంధాలు...మాక్సిమ్గోర్కి అమ్మ, గాంధీజీ ఆత్మకధ, నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలు... H v శేషద్రి కాల రాత్రి...ఏడు తరాలు...ఓల్గా సే గంగ వంటి అనేక విశిష్ఠ గ్రంధ పఠనాలకు దారి తీయటం నా పూర్వ జన్మలో చేసుకున్న యే కాస్త పుణ్య ఫలమో....!
చిన్నప్పటి నుండి చూసిన పౌరాణిక, జానపద,చారిత్రక, సిని మాల ప్రభావ ఫలమేమో
భాష, సంగీత, సాహిత్య, అభినయాలపట్ల మక్కువ పెరిగి... నన్నూ ఓ కవిగా, గాయకునిగా, కళా కారునిగా మలిచినై... ఇది నా అదృష్ఠము...!
ఎన్నో సత్గ్రంధాలు, ఎందరో మహాను భావుల ఉపన్యాసాల ప్రభావమేమో....
దేన్ని తెలుసు కుంటే... ఇంక తెలుసుకో వలసిన దేది వుండదో... దాన్ని తెలుసుకో గలిగాను...
ఇంక దేన్ని పొందితే పొంద వలసిన దేది వుండదో దాన్ని పొందే ప్రయత్నంలో వున్నాను...!
ఇప్పటికి డె ఇబ్బై రెండో వసంతం లోకి అడు గిడినా...
ఇంకా పూర్తిగా నాపూర్వ పాప కర్మల పరిహారం జరగ లేదేమో...
బీ పి , సుగర్,వంటి దీర్ఘ కాలి కాలతో పాటు ... అనేక చిన్న చిన్న తాత్కాలి కాలు కూడా ఇప్పటికీ పీడించటం నా దౌ ర్భాగ్యం...!
ఐనా.... వీ ట న్ని టి నీ పక్కన పెట్టి...
వాట్సాప్ గ్రూపులలో... చేతనైనది రాస్తూ... వీ లైనవి పాడుకుంటు చివరి రోజులతో కాలక్షేపం చెయ్యటం గాక... నాలాంటివానికి ఇంకేం పని...
ఈ శేష జీవితం ఇలాగే ప్ర సాంతముగా ముగిసి పోవాలన్నదే నా కోరిక...!
మరెట్టి కోరికలూ లేవు..!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి