ప్రాస మంజరి పద్యాలు :- డా. ధనాశి ఉషారాణి -ప్రాసమంజరి రూపకర్త -భాకరాపేట తిరుపతి జిల్లా
వీరులదౌఘనమైనభూమిమాతృభూమి
త్యాగధనుల రక్తతర్పితమీసుర భూమి
సంపూర్మభాస్కరతేజజతుల్యమీభూమి
కార్యదీక్షతలధర్మరక్షితసద్భూమి
                                         

ధర్మచింతసత్యచింతనభారతీయత
న్యాయదీక్షతధర్మదీక్షభారతీయత
ఋజుమార్గమందాచరణయెభారతీయత
చైతన్య సంతర్పణతే భారతీయత
                                    

పరోపకారసహన శీలభారతీయత
దైవచింతితధర్మరక్ష భారతీయత
కర్తవ్యదీక్షన్యాయచింతభారతీయత
సమన్యాయంసమధర్మమెభారతీయత.  

మానవత్వశోభితసుమమెభారతీయత
ధర్మాచరణసమపాలనభారతీయత
న్యాయ రక్షణధర్మశిక్ష భారతీయ త
మమతానురాగమరందతభారతీయత. 

నయవంచననిలధ్వంసమేభారతీయత
నమ్మకద్రోహుమర్థనమేభారతీయత
స్వార్థతధ్వంసితమేనిలభారతీయత
త్యాగధనులసంరక్షితయెభారతీయత 


కామెంట్‌లు
శ్యామలీయం చెప్పారు…
ప్రాసమంజరి అన్నారు కాని ప్రాసనియమం ఐతే లేదు. మాత్రాఛందస్సు అనుకుంటాను. వివరణ ఇస్తే మీ ఛందస్సు యొక్క నిర్వచనం గురించి బాగుంటుంది.