కట్టెలకొచ్చిన రొక్కం : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
కిట్టయ్య మామ వచ్చాడు 
ఎండు కట్టెలు కొట్టాడు 
చిన్నగా మోపు కట్టాడు 
నెత్తి మీద పెట్టాడు 

పిల్ల బాట పట్టాడు 
మెల్లిమెల్లగా నడిచాడు 
ఊరిలోకి చేరాడు 
కట్టెలు కట్టెలు అన్నాడు 

కోటయ్య తాత పిలిచాడు 
కట్టెల మోపు దించాడు 
రొక్కం చేతికి ఇచ్చాడు 
సంతకు అతడు వెళ్ళాడు 

సరుకులు కొన్ని కొన్నాడు 
ఇంటికి అతడు వచ్చాడు
కిట్టమ్మ అత్తకు ఇచ్చాడు 
సరుకులు తీసి పెట్టింది 

కమ్మని వంటలు చేసింది 
కంచం నిండా పెట్టింది
కడుపునిండా తిన్నాడు
హాయిగా నిద్రపోయాడు 


కామెంట్‌లు