ఇదీ విషయం:- - యామిజాల జగదీశ్
 
ఒకానొకసారి చిరుత, కుక్క మధ్య‌ పోటీ పెట్టారు...ఈ రెండింటిలో ఏది అతి వేగంగా పరిగెత్తుతుందో అనేదే ఆ పోటీ. 
గాలిలోకి తుపాకీ పేల్చారు... పోటీ ప్రారంభమైంది.
కుక్క పరిగెత్తడం ప్రారంభించింది..
కానీ చిరుతపులి పరిగెత్తి లేదు.‌ ఉన్న చోటనే నిల్చుంది. అంటూ ఇటూ చూస్తోంది ఏమీ ఎరగనట్లు.
దీంతో పులి తీరు చూసి ప్రేక్షకులు విస్తుపోయారు. 'ఏమైందీ చిరుతపులికి... ఎందుకు పరిగెత్తలేదు?' అని ప్రేక్షకులు పోటీ సమన్వయకర్తను అడిగారు.
దానికి, అతను - "కొన్నిసార్లు మీరు ఉత్తములని ఇతరులకు నిరూపించుకోవడం సిగ్గుచేటు.
ఒక చిరుతపులి తన వేగాన్ని వేటాడేందుకు మాత్రమే ఉపయోగిస్తుంది. అది కొన్ని కుక్కలకు దాని వేగాన్నో బలాన్నో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
కాబట్టి, మన జీవితంలోనూ చాలా సందర్భాలలో, మనం ఉత్తములమని అందరికీ నిరూపించుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు.
అలా చేయడం వల్ల మన సమయం, డబ్బు, శక్తి వృధా చేసుకోవడం తప్ప మరొకటి కాదు.
అనవసరమైన అనర్హమైన వ్యక్తులకు మనం ఎవరో నిరూపించుకోక పోవడమే ఉత్తమం" అని అన్నారు.

కామెంట్‌లు