మనిషి తాను చేసే జీవన ప్రాయానంలో....
ఆ ఖ రి మజిలీ....!
ఆ శ లు, ఆశయాలు....
బరువులు, బాధ్యతలతో
అలసి - సొలసిన....
తనువు, మనసులకు....
విశ్రాంతికాలం... ఈ వృ ద్దా ప్యం...!!
జీవితానుభ వాన్నంతా నెమరు వేసుకుంటు....
ఆనంద, దుఃఖానుభవాల ఊయల లూగుతూ....
నిజ జీవితానుభవంతో
వేదాంత సారాన్ని ఒంట బట్టించుకునేది...
ఈ వృద్దాప్యం లోనే !!
అంత వరకూ సింహంలా బ్రతికినా....
ఇంట్లో అందరూ కూరలో కరివేపాకులా పక్కన పడేసే స్థితి వృద్దా ప్యానిది...!!
ఛాదస్తం అనుకున్నా....
అనుభవ జ్ఞానాన్ని ...
పిల్లలకు పంచా లనుకునే
తపన ఈ వృద్దాప్యానిది!
ఇక నైనా...ఏటిలో పడవ లా.... వైరాగ్యపు నిర్మల ప్రసాంత జీవనాన్ని గడప మనేదే...
ఈ వృద్దాప్యపు సందేశ0...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి