పారిజాత పరిమళంతో
పలకరించు ప్రభాతం
చిలకరించు సంతోషాలు
ఎంతో ఆనందభరితం కాదా!
తుషార శీతల సమీరాలు
హుషారు పుట్టించి నడిపిస్తుంటే
నులివెచ్చని కిరణాల
తాకిడి దైవ స్పర్శ కాదా?!
సూర్యోదయ దర్శనం
చిదానంద కారకమై
చిగురించే కోరికలతో
నవోదయమే అవదా!
కనిపించే అరుణోదయంలో
వినిపించని భూపాలమేదో
తలపించే పవిత్ర భావనలో
తనియించేదే మానసం కదా!
మనోహర వర్ణచిత్రంలా
నభమంతా ప్రకాశించగా
యవనిక తొలగిన వేదికలా
ప్రాగ్దిశ వెలిగె భాసురమై!
జీవితాల దిశలు మార్చి
కోరిన తీరం చేరు దారిచూపి
దన్నుగా తానున్నానని చెబుతూ
ఏతెంచు మమ్ము గాచు దైవాన్ని
స్వాగతిస్తూ... వందనములతో
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి