సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -131: - అయిపోయిన పెండ్లికి మేళమెందుకు?
****
"అవ్వా!ఇంగో! నావల్ల కాదు. పొద్దున లేత్తే ఒకటే రసరస! నీ అయ్య అట్ల,నీ అమ్మ ఇట్లని వద్దిత్తుంటే ఏవనిపిత్తది శెప్పు.  "
 " ఇంతకీ యిష్యం ఏమిటో శెప్పక మున్పే గట్ల రంది వడ్తున్నవేంది శెల్లే! ఎవలు నిన్ను అంతంత లావు మాటలంది? గస్మంటోళ జోలికి నువ్వెందుకు బోయినవ్ శెల్లె!"
ఇంకెవలో అయ్తే గింత బాధ నాకెందుకు అవ్వా? మీ మర్దినే.  ఏప్పుడూ ఏదో ఒక ముచ్చటి ముందేస్కుని గయ్యాల ఫలానోళ్ళు గట్లన్నరు, గిట్లన్నరు అన్కుంట నువ్వుండి సుత కిమ్మనకుండా ఉన్నవ్! అట్ల మాటలు బెడ్తడవ్వా!"
 ఇనీ ఇనీ శెవులు శిల్లులు బడ్డట్లయితన్నయని ఎందుకయ్యా? గా ఎన్కటి ముచ్చెట్లు కూడు బెడ్తయా కుమ్ము బెడ్తయా! పశాంతంగ ఉండరాదు. ఒక్కొక్కలు బోడి సలాలు  యిచ్చుడెక్కువయిందని ఎగిరి పడ్తడు. సచ్చే సావొచ్చిందవ్వా! బత్కంటనే ఇరక్తి బుడ్తుందన్కో...
 గంత మాటనకు శెల్లె! సంసార మన్నంక మొగుడు పెళ్ళాల మధ్య గిస్మంటివి జరుగుతనే ఉంటయి గంత మాత్రానికే గట్ల బుగులు పడకు శెల్లె!"
 అగ్గో నిన్ను ఎతుక్కుంట మర్ది రానే వొత్తుండుగని! నువ్వు గా లోపలి తల్పు ఎన్క దాక్కో...
 "ఏమయ్యా; మర్ది ఏంది సంగతి! గీ నడ్మల మరీ నల్ల పూసైనవ్! కనపడ్తనే  లేవు. ‌
ఏం లెవ్వు వొదినా! నీ శెల్లెగిట్ల గిటొచ్చిందేమో తోల్కపోదమని వొచ్చిన.
"అయినా గిటెందుకొత్తదయ్యా? దాని మన్సేమన్న కట్టబెట్టినవా ఏంది? శెరం కొద్ది ఏం నుయ్యో గొయ్యో సూస్కుంటె ..ఇంగేమన్న ఉందా?
 "ఆఁ ! గంత మాట నేనెందుకు అంట వొదినా? ఏవో ఎన్కటివి యాదికొచ్చినప్పుడు మస్తు కోపమొత్తది? గదాని గురించే అంట."
గా ఎన్కటియి యాద్దెచ్చుకోవడం వల్ల ఏమన్న ఫాయిదా ఉందా! పంచాతి పట్టింపులు తప్ప."
 అయిన గని నాకు తెలీక అడుగుత "అయిపోయిన పెండ్లికి మేళమెందుకు" అన్నట్టు,జర్గిపోయిన ఆటిని ఎనక్కి తేవొత్తదా? నువ్వే శెప్పు.
రాదు గని గవి యాదికొచ్చి కోపమొత్తది.గిట్ల ఏదో ఒకటి అంటుంట. నువ్వన్నట్టు గది సుత తప్పేలే వొదినా?"
అమ్మయ్య!ఇంగ రా శెల్లె!  మాట దీస్కున్న . ఇంగెప్పుడు గా వూసు ఎత్తడు తీ!
గట్ల ఇద్దరినీ కలిపి గాళ్ళకి గిన్ని మడుగూలు పెట్టి శాయసుక్క బోసింది అవ్వ. గవి తిని తాగి ఇద్దరూ నవ్వుకుంట తుళ్ళుకుంట ఎళ్తుంటే సంబురంగ జూసింది.
గదండీ సంగతి "అయిపోయిన పెండ్లికి మేళమెందుకు?" గతం తిర్గి రాదు .గది తొవ్వుకొంటే  గిట్లనే మనస్పర్థలు వొత్తయి.

కామెంట్‌లు