సుప్రభాత కవిత : - బృంద
తూరుపు తలుపు తోసిన 
కిరణం
వాకిట విరిసిన వేకువ 
కుముదం

కల్హారాలకు కాంతులు అద్దే 
వెలుగులు 
తరుణ భాస్కరుని చురుకు 
శరములు

స్వర్ణ స్వప్నపు తరగని 
వర్ణ వైభవము 
రవ్వల ముక్కల వోలె 
తళ తళ మెరుపులు

తెలిమంచు కరిగిన వేళ 
తొలిసంజె వన్నెలు 
తెలివెన్నెల సోనల పోలిన
జలతారు ధారలు

విరివనమున నికుంజముల 
పరిమళము 
కనకవనమున కమనీయ
కాంచన పుష్పము

ఆగని తేరు వంటి 
కాలపు తీరు నందు 
సుధామయమవ్వాలి 
వ్యధా భరిత హృదయాలు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు