సుప్రభాత : కవిత - బృంద
చినుకులుగా కలతలు చేరి 
శిలలుగా స్థిరముగ మారి 
కలలు తీరని కన్నుల వెంట 
సాగే కన్నీటి ధారలో

వినిపించని ఆజ్ఞలకు 
కనిపించే విధేయతగా 
అనిపించే విధిరాతలు 
నడిపించే బ్రతుకులను

వెనుతిరగక సాగమని 
వెలుతురు రాక తప్పదని 
వేకువ ఎపుడూ ఆగదని 
వేదన శాశ్వతం కాదని....

ఎదురయే కష్టాలన్నీ 
ఎగిరిపోయే తీరునని
ఎరిగినవే ఇవి నాకని 
ఎరుక కలిగి ఉండాలని...

అలుపు ఎరుగక  ఎపుడూ
అడుగు ముందుకే వేయమని
అలజడులు ఆపలేని
అంతిమ విజయం నీదేననే...

అరుణమైన ఆకాశంలో
అందమైన వెలుగు బంతి
అందరికి క్షేమమోసగే
అంశుమంతుడు ఆదిత్యునికి..

అర్ఘ్య పాద్య ఆచమానాలతో....

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు