మూర్ఖ త్వమా....!? .. కోరాడ నరసింహా రావు!
మోడు చిగురించాలన్నా
 బీడు మొలకెత్తాలన్నా
   ప్రాణుల దాహార్తి తీరా లన్నా
  మన కడుపులు నిండి,   మనం కలకలలాడాలన్నా
   మేఘుడు కరుణించా ల్సిందే....! 

నేల పచ్చదనంతో పరవ సించాలంటే... 
  ఈ నేలకు తల్లి యైన ఆ జలం ఈ నేలను తన ఒడిలో సేద దీర్చాల్సిందే! 

నింగి నేల నిప్పు నీరు గాలి... 
  వీటిని మనం పంచ భూతా లంటూ 
   ఆరాధించేది తెలివి తక్కువ చేతనా...!? 
   వాటి శక్తిని మనం తెలు సుకున్నాము కనుకనే!! 

అవి దేవుళ్ల. ..!?! వీళ్లు మూర్ఖులు... 
  అనుకున్న వారిని అనుకో నివ్వండి...! 

సాటి మనిషి చిన్న సాయం చేస్తేనే ... 
థాంక్ యు  థాంక్ యు
అంటు... 
  వంగి  వంగి చెబు తామె 
  ఆలాంటిది... 
   మానబ్రతుకుకు... మన పుట్టుకకే కారణ భూత మైన ప్రకృతి శక్తులు... 
   వీటిని దైవాలుగా ఆరాధించి కృతజ్ఞత తెలుపు కోవటం మూర్ఖ త్వమా....!! 

పొందిన లాభాలన్నీ పొంది.... కనీస కృతజ్ఞత చూపక పోవటం మూర్ఖ త్వమా....!? 
     ఏ ది  మూర్ఖత్వం....!?
********


కామెంట్‌లు