అక్షరాలకు అందని
ఆశల ఉయ్యాలలో
అలుపెరగక ఊగే
అదుపులేని మనసుతో...
పిలుపుకందని దూరాన
పలకరింపు కోసమే
పలవరించే తలపులతో
పరవశాన నిరీక్షించు చూపులతో..
కదులుతున్న కాలంతో
కదలలేక వదలలేక
పదిలంగా దాచుకున్న
ప్రేమ నిండిన తలపులతో....
వాసంత సమీరాలకై
వేచిన శిశిరంలా
పల్లవించు కనులలో
ఎదురుచూచు వలపుతో....
దగ్ధ స్వప్నాలు ఎన్నున్నా
స్నిగ్ధ దరహాస చంద్రికలతో
ముగ్ధ మోహన మూర్తి రాకకై
ముకుళిత హస్తాలతో...
ప్రత్యక్ష నారాయణుడికి
ప్రఫుల్ల హృదయంతో
ప్రభాత సమయాన
ప్రసూనాంజలి🙏
రేపన్న మాట ఒక్కటే
మాపును కలతలెన్నో
ఓపిక తో వేచివుంటే
వేకువగా వచ్చి చేరు విజయాలన్నీ!
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి