సామెత -143: - *అరవల పొట్ట తమలపాకుల కట్ట ఎప్పుడూ తడుపుతూనే ఉండాలె
****
"అవ్వా! గీ తాతీలు ఎందుకొచ్చినయో? ఏపని కానియ్యట్లే. కాళ్ళకి అడ్డంబడుతుండ్రు.అమ్మా! అప్పలు జేసి పెట్టమని పెద్దది. శిన్నోడు అర్టిపండంటడు జామ్మంపండంటడు.గానికి పండ్లు గావాలె.దీనికి అప్పలు గావాలె. గాళ్ళు బల్లెకి బోతెనే ఆయిగుంటదవ్వా!"
"పాపం తాతీల్ల సుత పొమ్మంటవానే! పిల్లలకి బడుంటే సద్వు జ్యాసుంటది. రాసుకోడం,సద్వుకోడంల తిండి మీద సుత జ్యాసుండదు.
అవునవ్వా! గప్పుడేమో! కలిపి కుక్కి కుక్కి నోట్లె బెట్టినా తినకపొయ్యిరి.గిప్పుడు నా బుర్ర తింటుండ్రు,సయిమాన్ని సుత తింటుండ్రు.
ఇంగ మా అక్కలిద్దరు ఆరం పది దినాలుంటరని, గీసారి నా తానకి పిల్లగాండ్లను పంపిండ్రు. గాళ్ళని సూడాలె.మా పిల్లలే అల్లరి పిడుగులు అంటే గాళ్ళకి తాతలు వాళ్ళు .ఏం జేసి బెట్టినా నిముషంల ఆంపట్టే.
"పందుం తిన్నా పరిగడుపే" అన్నట్టు ఎవలన్న సూత్తే గీ పొల్లగాండ్లకి ఏం బెట్టలేదా ఏంది గట్ల నకనకలాడుతుండ్రు అనుకుంటరవ్వా? మా అక్కలు గీ పిల్లలతో ఎట్లేగుతుండ్రో ఏమో?
గట్లుండకుండ గాళ్ళకి ఏం జేసిపెట్టాల్నో సమజైతలే? ఏదన్న ఉపాయం జెప్పి నన్ను రచ్చించరాదవ్వ. నీకు పున్నెముంటది.
"ఇగ్గో మీనాచ్చీ! మన పెద్దోళ్ళు"అరవల పొట్ట -తమలపాకుల కట్ట ఎప్పుడూ తడుపుతనే ఉండాలె "అంటరు. గీ పిల్లగాండ్లు సుత గస్మంటోళ్ళని అన్కో!"
"ఏందవ్వా! ఏమేమో జెప్పినవ్!తమలపాకుల కట్ట తడపాలని తెల్సుగని 'అరవల పొట్ట సంగతేంది' బలే గమ్మతిగుంది?"
"అవును మీనాచ్చీ!నా శిన్నప్పుడు మా తాత ఎప్పుడూ శెప్పేటోడు. గా అరవోళ్ళు యాడ పన్జేసినా గడియ ఇరాం లేకుండా ఏదో ఒకటి నవులుకుంట పొట్ట తడుపుకుంటనే ఉంటరంట. ఇంగ తమలపాకులు అమ్మేటోళ్ళు త్యేప త్యేపకి నీళ్లు జల్లి తడపడం సూత్తున్నం గద! గట్లన్న మాట.
"అయితే గిప్పుడు ఏం జేయాల్నో శెప్పవ్వా?"
గదే శెప్పబోతున్న.జెర గుర్రాన్ని కట్టెయ్. గిప్పుడు మాడికాయలు దొర్కుతున్నయి గద. వాటిని కొంచెం పెద్ద తునకలు జేసి పచ్చడి జెయ్యి.గట్లనే నిమ్మకాయ ముక్కలు సుత ఊరేశి.బాగా ఊరినంక పచ్చడి జెయ్యి."
పాపం గీటితో ఆళ్ళ ఆకల్లేం తీర్తయవ్వా?"
గాళ్ళని ఉపోశాలు వుండమనో ,ఉంచమనో శెప్పట్లే మీనాచ్చీ! పొద్దుగాల గాళ్ళకి కడ్పు నిండ అన్నమే బెడ్తవో, ఇడిలీ బెడ్తవో నీ ఇట్టం తిన్న తర్వాత మామిడి కాయ తొక్కులోంచి ఓ మామిడి కాయ శెక్కనో గట్లనే ఊరేసిన నిమ్మకాయ ముక్కనో,ఉస్రిగాయనో నపరొకటి ఇయ్యి. గవి సప్పరిచ్చుకుంట ఉంటరు. గట్ల వాళ్ళ నాలికలు తడపడం వల్ల ఆరోగ్గేనికి మంచిది.ఇంగ మల్ల నిన్ను సతాయించుడు సుత తగ్గుద్ది.
అవ్వా! గిదేదో బాగనే ఉంది.అరవోల్లొతికె ఏదో తిండితో పొట్ట తడపక తమలపాకుల కట్టొతికె నోట్లె నీళ్ళూరెటట్టు గిట్ల తడిపితే బాగనే ఉంటది.బలే మంచి అవుడియా శెప్పినవవ్వా!
ఇంగ పోత. ఉస్రికాయలు, నిమ్మకాయలు లేకుంటే తెప్పిత్త.గిప్పుడైతే తలొక మామిడికాయ శెక్క కారం లేకుండ జూసి ఇత్త " అన్కుంట బోయింది మీనాచ్చి.
గదండీ సంగతి. "అరవల పొట్ట తమలపాకుల కట్ట ఎప్పుడూ తడుపుతూనే ఉండాలె" అంటే గిదే మరి.పిల్లలు సుత గట్లనే ఉంటరు. గాల్లకి అవ్వ శెప్పిన ఉపాయం శేత్తే శిరుతిల్ల జోలికి పోకుండా బాగుంటుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి