అగ్నిలో కాలకపోతే
అపరంజికి మెరుగేది?
ఉలి దెబ్బకు భయపడితే
శిలకు శిల్పంగా మార్పేది?
పోరాటం లేకపోతే
ప్రగతి ఎలా సంభవం?
ఆరాటం లేకపోతే
అన్వేషణ ఎలా సంభవం?
నలగని మనసుకు
వెలుగుల దారి ఎక్కడిది?
జిలుగుల తారలకు
పగలు చోటెక్కడిది?
కరగని మంచుకు
కదలిక ఉంటుందా?
తరగల పయనానికి
తీరం దొరుకుతుందా?
చీకటి మూసిన రేయికి
వేకువ రాక ఉంటుందా?
వెలుతురు నిండిన లోకంలో
కలతలు కరగక వుంటుందా?
జవాబు లేని ప్రశ్నలెన్నో
సాయం లేని సమస్యలెన్నో
తెగే దాకా లాగేవెన్నో
తెగిపోయాక వగచే వెన్నో?!
ప్రశ్నలున్నాయని
ప్రభాతం ఆగదుగా
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి