ఒత్తిడి!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
ప్రపంచాన్నంత 
మనం 
నింపుకోవడం తప్ప 
మనం 
ప్రపంచంలోకి ఒంపబడలేదు..!!?

మదే 
నింపబడలేదని 
నదీ ఏడుస్తుంటే
పదిమందికి పంచమని 
పంచాయితీ పెట్టి 
నది గుండె పగలగొట్టిన దెవరు.!?

ఆలోచనల వల్ల కాదు 
అనుభూతుల వల్ల 
ఒత్తిడి పెరుగుతుంది.!!

వివేకుల వల్ల కాదు 
నాయకుల వల్ల 
ఒత్తిడి పెరుగుతుంది.!!?

గతంలో మనం పుట్టనే లేదు 
భవిష్యత్తులో మనం మరణించాం 
వర్తమానం లోనే మనం ఉన్నాం.!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు