ప్రభాతసమయాన లేచిపనులు చేసుకునే ముందుపండ్లు తోముకున్న వెంటనేపాలతో కూడిన వేడి కాఫీ టీలు త్రాగందేఉండలేని నేటిసమాజం.పసిపిల్లలకు తల్లిపాలు పోయి పోతపాలు పట్టడంపెరుగు, మజ్జిగ లేనిదే పూట గడవలేని స్థితితెల్లవారుజామున లేచి పాలవాడి గురించి ఎదురుచూపులుప్రతిరోజు సమయానికి పాలందిస్తున్నపాలవాడు అనధికారికంగా నడిపే పాల డైరీలో పాలను చల్లబరచే కూలెంట్పాడయి వెల్డింగ్ చేయించినాబాగుపడక పోయినాప్రజలేకదా అని స్వార్ధంతోకలుషితమైన పాలనే అందిస్తుకిడ్నీలు పాడయి ప్రాణాలు పోవడం,అనారోగ్యానికి కారణమవడంఅనేక కుటుంబాల కడుపుకోతకు కారణమవడానికి కారణమైంది.పోయిన ప్రాణాలు ఎన్నికోట్లు ఇస్తే వస్తాయిక్షీరమే కాలకూట విషమై కాటేసిందా?దీనికి బాధ్యులు ఎవరువిజ్ఞులు ప్రాజ్ఞులు ఒక్కసారి ఆలోచించండి!
( ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి లో పాలు కలుషితమై కిడ్నీలు విఫలమై కొందరి మరణానికి ,అనారోగ్యానికి కారణమైన సంఘటన విని ఆర్ద్రతతో వ్రాసినది)............................
క్షీరమే కాలకూటమై కాటేస్తే:- కవిమిత్ర ,సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి