ఆ ఆట పేరు చెప్పండి :- ఎడ్ల లక్ష్మి
జానయ్య తాత వచ్చాడు 
జానెడు కట్టే తెచ్చాడు 
పిరికేడు సిర్ర చెక్కాడు 
చిట్టి బొద్ధి తవ్వాడు 

దానిమీద సిర్ర పెట్టాడు 
గోనె తోటి కొట్టాడు 
బిర బిర లేసి ఆ సిర్ర
ఎంతో దూరమెళ్ళింది

గోనె పట్టి కొలిచారు 
సిర్రకు బొద్ధికి దూరం 
ఎన్ని గజాలో చెప్పారు 
పిల్లలు ఒంట్లు నేర్చారు 

ఆడే స్థలము చేరండి 
ఆటను మీరు చూడండి 
ఆ ఆట పేరు చెప్పండి 
గేయంలో గుట్టు విప్పండి 


కామెంట్‌లు