నే లఫై ఎనిమిదేండ్ల జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ,చదివిన పాఠశాలకు చేయూతనిస్తూ సింగుపురం పూర్వ విద్యార్థులు శభాష్ అనిపించుకున్నారు. సింగుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1977-78 పదవ తరగతిచదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సింగుపురం ఫంక్షన్ హల్ లో జరిగింది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, యోగక్షేమాలు తెలుపుకుంటూ, ఉదయం నుండి సాయంత్రం వరకు వయసు మరచి ఆట పాటలతో సందడి చేసారు. అనుపోజు బాబూరావు మరియు ముఖ్య అతిధులు విశ్రాంత ఎస్ ఐ వెంకటరావు , ఎన్ శాంతరావు ల సినీ మధురగీతాలు అలరించాయి. సి.హెచ్.రాజారావు, ఎ.నాగేశ్వరరావుల పౌరాణిక పద్యాలు, శైలజ అన్నమయ్య కీర్తనలు ఆకట్టుకున్నాయి. మాధవరావు, కృష్ణమూర్తి నిర్వహించిన వేర్వేరు కృత్యాలతో అందరూ ఆనందోత్సాహాలతో గడిపారు. అనంతరం వారు చదువుకున్న పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయులు భారతిని కలసి పాఠశాల అభివృద్ధి నిమిత్తం నగదు బహుమతిని అందజేశారు. తరచూ తాము కలవాలని, తమ స్నేహం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు.
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ కలయిక
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి