అప్పుడు - ఇప్పుడు: - - యామిజాల జగదీశ్
 కన్నయ్య ఎవరు ? 
కృష్ణుడు ఎవరు ?
ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడా
వయస్సు మాత్రమే.
కన్నయ్య అనేది ముద్దు పేరు. ముద్దుగా పిలవటం. బాల్యం దేశ.
కృష్ణుడు అనేది ఎదిగిన ప్రాయం.
ఈ రెండింటికీ ఉన్న తేడా వయస్సేగా.
కన్నయ్యగా ఉన్నప్పుడు గోపికల వస్త్రాలను దాచి పెట్టిన వారు వెతుకుతుంటే చూసి ఆనందించే వాడు. కన్నయ్యే కృష్ణుడిగా ఎదిగినప్పుడు ఒక స్త్రీ పై వస్త్రం లేదని ఆందోళన చెందినప్పుడు పై వస్త్రాన్ని చ్చి ఆమె మానాన్ని కాపాడాడు.
రెండింటికీ తేడా వయస్సు మాత్రమే.
కన్నయ్య కుర్రాడిగా ఉన్నప్పుడు మిత్రులతో కలిసి ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళి వెన్న దొంగిలించి తినేవాడు. తల్లి అడిగినప్పుడు తాను దొంగిలించి లేదని అబద్ధం చెప్పేవాడు.
ఆ కన్నయ్యే కృష్ణుడిగా మారాక "దొంగతనం చేయకూడదు... అబద్ధాలాడకూడదు..." అని గీతోపదేశం చేశాడు.
రెండింటికీ తేడా వయస్సు మాత్రమే.
సర్వం కృష్ణార్పణం

కామెంట్‌లు