ఏ మనసు బరువు తగ్గించే
ఏ మంచి కబురు తోనో....
ఏ కనులు కన్న కలలో
ఏ తీరున తీర్చు దారులో...
వెదికి తెచ్చే వేకువ!
చింతలకు లోనై చిన్నబోయి
చిరునవ్వు మరచిన పెదవికి
చిన్ని నవ్వు పొదిగి మురిపించు
చక్కని మాటొకటి మూటకట్టి
మోసి తెచ్చే వేకువ!
కలలు తీరక కలత చెంది
కలవరంలోనే కాలం గడిచిపోగా
కనుల నీరు నింపి ఎదురుచూచు
కనుదోయి కోరిక తెలిసి
కరుణింప వచ్చు వేకువ!
ఆపదలు చుట్టుముట్టి
ఆరడి పెడుతూ రకరకాల
ఆంక్షల నలిగిపోతూ...
ఆటబొమ్మగ మారిన బ్రతుకులో
ఆదరము నింపే వేకువ!
కష్టాల కడలి ఈదుతూ
కనిష్ఠ ఆధారము కరువై
కదలలేని అశక్తత కమ్ముకోగా
కాలచక్రము కింద నలిగే...మదికి
బ్రతుకు మీద ఆశ కలిగించు వేకువ!
నీటి మీది నావకు చుక్కానితీరున
జీవన నౌకకు చేరవలసిన తీరము
తెరలు తొలగినట్టు తోచే దారి
తరలి తానే వచ్చు తరుణములా
కదిలి వచ్చి కొంగు నింపే వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి