ఆ చూపే చాలు!: - - యామిజాల జగదీశ్
 భగవాన్ రమణ మహర్షి చివరి రోజుల్లో, మొదటి ఆపరేషన్ ముగిసినప్పుడు, భగవాన్‌ను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని వైద్యులు కఠినంగా ఆదేశించారు. పైగా వైద్యులు తమ ఆదేశాలు పాటించడం కోసం ఒకరిని నియమించారు.
అయితే ఆ సమయంలో, రమణమహర్షిని దర్శించుకోవడం కోసం ఒక సాధువు వచ్చాడు.
వైద్యులు నియమించిన వ్యక్తి పరిస్థితిని వివరిస్తూ ఆ సాధువు అభ్యర్థనను తిరస్కరించాడు.
సాధువు ఎన్ని విధాలుగా చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. చివరి ప్రయత్నంగా ఆశ్రమ కార్యాలయానికి వెళ్ళి ఒక్క క్షణం భగవాన్ ని చూసి వెళ్ళిపోతానన్నాడు.
ఈ రోజు తను ఊరికి వెళ్ళిపోతానని,  
కాబట్టి దయచేసి భగవాన్ ని చూడటానికి అనుమతి ఇవ్వండి అని ఎంతగానో చెప్పాడు సాధువు.
అయితే అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది. వైద్యులూ "స్వామీ, మేమీ ఏమీ చేయలేం" అని చెప్పేశారు.
దాంతో సాధువు తాను దురదృష్టవంతుడినని బాధపడి అక్కడి నుంచి మెల్లగా అడుగులు వేశాడు.
అయితే ఆశ్చర్యం! 
సాధువు బయటకు వస్తున్న దారిలో భగవాన్ వచ్చి నిల్చున్నారు. అంతే,  ఆయన ఎదురుగుండా నిల్చుండిపోయాడు సాధువు.
ఇద్దరూ ఓ పది నిమిషాలు సంతో షంగా ఒకరినొకరు చూసుకున్నారు.
అనుతరం సాధువు తన జన్మ ధన్యమైందనుకున్నాడు. ఈ చూపుల కోసమే కదా తాను అందరినీ అంతసేపు అడిగానని, తీరా భగవానే ఎదురుపడి తన కోరిక తీర్చారనుకున్నాడు సాధువు. అనంతరం అక్కడి నుంచి తన దారిన వెళ్ళిపోయాడు సాధువు.
భగవాన్ గదిలోకి వెళ్ళిపోయారు.

కామెంట్‌లు