దూరపుకొండలు నునుపు: - కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి) -విశాఖపట్నం
పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలితో
ఆప్యాయత అనురాగాలతో
పచ్చడన్నమైన పదిమంది
సంతోషంగా తినే రోజులుపోయి
పాశ్చాత్య పోకడలకు అలవాటై
నగరంలో జీవితం సుఖమయమని
బంగరు పల్లెలను వదలి
యాంత్రిక జీవనం
రోబోల వలె ప్రవర్తిస్తు
బహుళ అంతస్థుల భవనాలలో నివసిస్తు
పర్వదినాలలో కూడా
చరవాణితో కాలక్షేపం చేస్తు
నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్షయని
ఆప్యాయతలు అనురాగాలను మరచి
స్వచ్ఛమైన గాలి లేక
భూతాపాలకు కారణమై
జీవిస్తున్న ఓ మరయంత్రపు మనిషీ
నిజంగా నీవు స్వేచ్ఛగా  స్వతంత్రంగా నగరంలో బ్రతుకుతున్నావా
కాలం ఎవరికోసం ఆగదు
ఆ నలుగురు అవసరమని తెలుసుకు
దూరపుకొండలు నునుపన్నది తెలుసుకు
ఆరోగ్యాజీవితానికి ప్రకృతి పరిరక్షణ అవసరమని మరవకు...!!
............................


కామెంట్‌లు