*తెలంగాణ బిసి లెక్చరర్స్ అసోసియేషన్ 471, న్యూ క్యాలెండర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చెరుకు శరత్ కుమార్ గారి చేతుల మీదుగా ఫిబ్రవరి 19న ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈసందర్భంగా డి.ఐ.ఇ.ఒ చెరుకు శరత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను చక్కగా చదివించాలని, ఉత్తీర్ణత సాధించాలనీ, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు .
అనంతరం డి.ఐ.ఇ.ఒ చెరుకు శరత్ కుమార్, సీనియర్ లెక్చరర్ కేదారేశ్వర్ గార్లను శాలువాతో సన్మానించడం జరిగింది.
తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ సామాజిక సేవలోను, లెక్చరర్ల సమస్యలు పరిష్కారం కోసం పని చేస్తుందని అన్నారు. బిసి లెక్చరర్స్ ప్రమోషన్లలో ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరించాలని కోరారు.
ఇందులో టి.జి బిసి ఎల్ ఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసరవేణి పర్శరాములు, ఆర్ . శేఖర్,కేదారేశ్వర్, మురళి, పండుగ యాదగిరి,రేగుల లక్ష్మణ్, ఇమ్మడోజు మహేందర్, క్యాతం సత్యనారాయణ, కృష్ణ, మోహన్ రేగుల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి