పల్లవి//
శ్రీశైలం మల్లన్నరా... !
ఆ కొండల్లో కొలువుండేరా!*మము కాచేను ఈ సామిరా!
చరణం//
మొక్కులతో కొండెక్కి
చక్కనైన స్వామికి
ఒక్కొక్క మెట్టెక్కి
చెక్క భజనలే చేస్తూ
ఇక్కట్లు దీర్చమనుమురా...!
మన చిక్కులు విడదీయుమనుమురా...!
ఇక ఫక్కున నవ్వి దీవించునురా!!
శ్రీ//
చరణం//
శివరాత్రి మహారాత్రి
మదినిండే మహిమ రాత్రి
శుభరాత్రి జయరాత్రి
జగములు నినదించు రాత్రి
జాగరణ మనముందుము రా ...!
స్వామి నటరాజును కొల్చుందుము రా ...!
యోగ ముద్రలను నిలిచుందుము రా!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి