కదలిక...!!-డా.ప్రతాప్ కౌటిళ్యా.
శృంగారం అంటే 
కదలిక. 
అణువు కదులుతుంది 
పరమాణువు కదులుతుంది 
పదార్థము కదులుతుంది. 
విశ్వము కదులుతుంది. 

శృంగారము అంటే కదలిక!!?

నక్షత్రము తిరుగుతుంది 
గ్రహము తిరుగుతుంది 
ఉపగ్రహము తిరుగుతుంది 
భూమి తిరుగుతుంది 
ఇది కంటితో చూడలేనిది. 

శృంగారము అంటే కదలిక. 

సహజము కదలిక 
విశ్వజనీనము కదలిక 
నిజము శృంగారం...

శృంగారము అంటే కదలిక 
శృంగారము అంటే చైతన్యం!!

డా ప్రతాప్ కౌటిళ్యా 
శ్రీ శ్రీ కళావేదిక సమన్వయకర్త.

కామెంట్‌లు