చిన్నారుల చిత్రాలు -భళా వినూత్నాలు

 తొట్టంబేడు:మండలం లో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారం తో చార్టులతో ఒత్తుల బుట్ట,ఆంగ్ల అంకెల గౌను,వారాల గొడుగు, నెలల పొద్దుతిరుగుడు పువ్వు 
సీతాకోక చిలుక మొదలగు చిత్రాలతో సందడి చేసారు.ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రతి శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమం లో విద్యార్థులు పాఠ్యాంశానికిఅనుబంధం గా వివిధ రకాల చిత్రాలను తయారు చేయడం వలన వారిలో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని అన్నారు.అనంతరం ఆటలు,పాటలతోఉత్సాహంగా గడిపారు.
కామెంట్‌లు