ఆత్మీయ అనురాగ బంధాలు: - కవిమిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం
పుడమి పై పుట్టినది మొదలు  
పరమాత్మ దరిచేరు వరకు
 మానవజీవితం అనేక బంధాల కలయుక
జన్మనిచ్చిన జనకుల ఆత్మీయ అనురాగ బంధం
ఏకోదరులమై పుట్టిన సోదర సోదరీమణుల 
బంధం జీవితాన మరువలేనిది.   వేదమంత్రాల మధ్య
ఏడడుగులు నడచి జీవితాంతం కష్ట సుఖాలలో
కలిమి లేములలో, తొడునీడగా
ఒకరికి ఒకరై జీవించిన వివాహాబంధం అతిపవిత్రబంధం
జీవితాన కన్నవారితో
కట్టుకున్న వారితో చెప్పుకోలేని అనేక విషయాలను
 చెప్పుకునే స్నేహబంధం అత్యంత మధురం
 అందుకే'సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అన్నది అక్షర సత్యం.
అజ్ఞానాన్ని తొలగించి యుక్తాయుక్తవిచక్షణను
 తెలియచేసి జీవితాన్ని ఆదర్శవంతమైనదిగా 
తీర్చిదిద్దే గురు శిష్యు సంబంధం  అత్యున్నత మైనది..!!

తల్లిదండ్రుల సేవచేసిన శ్రవణ కుమారుడు, ధర్మవ్యాధుడు
ఆదర్శదంపతులు సీతా రాములు ,  నాటి కృష్ణ కుచేల,నిన్నటి బాపు రమణల,శివాజీ మహరాజ్ రామదాసుల ,సాందీప కృష్ణబలరాముల బంధాలను  అనుసరిస్తే 
ఆత్మీయ అనురాగ బంధాలు జీవిత సాఫల్యతకు మనుగడకు ఆధారాలు ......!!
................................
లోకా సమస్తా సుఖినో భవంతు
...............................


కామెంట్‌లు