ఏ కుదుపులు లేని
ఏ కొరతలు రాని
ఏ కలతలు తరమని
ఏ అందము సాటిరాని
సౌందర్యము అవనిది!
క్రమం తప్పని సాయంసంధ్యలు
నియమం తప్పని ఋతువులు
నొప్పి కలిగించని సహజమైన
మార్పులు కలిగే
ముచ్చటైన అందం మహిది!
పచ్చదనమే పట్టుచీరగా కట్టి
ఆకాశపు మేలిముసుగు కప్పి
అందంగా నవ్వుతూ చూసే
అపురూపమైన ఆడపిల్లంటి
అందమే అందాల భువిది!
నింగి నుండి తొంగి చూచు
బంగారు కిరణాల కాంతికి
ముచ్చటగా మురిసి ముద్దుగా
వెచ్చగా చేతులు కలిపే
చక్కని సోయగం ధరణిది!
మనసారా స్వాగతించి రవిని
మమతలుప్పొంగ ఆదరించి
అణువణువూ ప్రసరించమని
అడుగడుగునూ పరిచయంగా
అనుసరించే పుడమి అందం!
చూపులకందని దూరంలో
చక్కని గగన వీధిలో అడ్డొచ్చే
చిలిపి మబ్బులను దాటుకుని
చిక్కగా కాంతులు రువ్వుతూ
తరలి వచ్చే తరణిని చూసి
తరించిపోయె సొగసైన ధాత్రి!
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి