ప్రార్థన: - డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 త్రినేత్రుడవై లోకాలనెల్ల చల్లంగ కాచి
మహేశ్వరుడవై మహిని
శాంతి యేర్పరచి
గరళకంఠుడవై సర్వకాలాల
కీడులు తొలగించి
రుద్రుడవై ఆయురారోగ్యాల
విభూతినొసంగి
హరుడవై సుకర్మల చేయు
చిత్తమును చైతన్యమొనరించి
శివుడవై శుభముల
శీఘ్రముగా నిచ్చి
శంకరుడవై మోక్షముల
కర్హుల మగునట్లు పురికొల్పి
విశ్వనాథుడవై విజయాల
పరంపరల నిత్యము జేసి
మల్లికార్జునడవై మరుజన్మ
మంచిదై చూచి
అర్థనారీశ్వరుడవై యర్థమును
గ్రహించు విచక్షణ కలుగజేసి
పార్వతీపతివై పాపముల
నుపశమింజేసి
గంగాధరుడవై జ్ఞానముల
పూర్ణముగా నింపి
చంద్రమౌళివై ఇంద్రియచాపముల
కతీతమొనరించు కైలాసవాస!
కామెంట్‌లు