నా సామి రంగ...(అక్షర సేద్యం): - కవిరత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
అలతి అలతి పదాలతో
పసందైన పదపొందికతో
అతి సుందరమైన సులభ శైలిలో 
భావ గాంభీర్యంతో అర్థవంతంగా

ఊరించే ఉపమానాలతో
అలంకారాలే ఆభరణాలుగా
ప్రతీకలే ప్రాణంగా ఒక కవి
రుచికరమైన ఓ కవితను వండివడ్డిస్తే...

అందమైన అజంతాశిల్పంలా చెక్కి
నవరస భరితమైన ఓ కవితనందిస్తే...

భర్తే ప్రత్యక్ష దైవమని
భావించే "ముత్తైదువులు"
"మెళ్ళో తాళిని" కళ్ళకద్దుకున్నట్లు...

"నా సామి రంగ"...
ఆ కవితను కళ్ళకద్దుకోరా
పాఠకులు చదివిన  పరవశించిపోరా..‌.
కవిని తమ మనసులోనే
"ధీర్ఘాయుష్మాన్ భవాంటూ దీవించరా..‌

నచ్చితే...కవితను
నలుగురికి షేర్ చేయరా...
మళ్ళీ చదువుకునేందుకు
సెల్లో భద్రంగా దాచుకోరా...
సంతోషంతో స్పందించి అభినందించరా
అప్పుడు కవి గాలిలో తేలిపోడా...
సంతోష సాగరంలో మునిగితేలడా...

ఔను ఓ ప్రియ మిత్రులారా
ఒక కవితను చదివి
తక్షణమే స్పందిస్తే కవిని అభినందిస్తే
పోయేదేముంది చెప్పండి...?
మరో "కొత్త కవితకు జన్మనివ్వడం" తప్ప.



కామెంట్‌లు