ప్రేమంటే ఏమిటంటే.....?: నాగలక్ష్మి కుంజా - తెలంగాణ సాహితి భద్రాచలం శాఖ
ప్రేమంటే ఏమిటంటే.....?  తెలుసా?
ప్రేమంటే అనంతమైనది అనిర్వచనీయం!!

 సముద్రమంత ప్రేమ అలలై ఉవ్వెత్తున ఎగిసి పడితే 
 సముద్రమంత ప్రేమ విఫలమే భారమై గుండెనే చీల్చే

తామరాకు గుండెలపై జారే స్వాతి ముత్యం ప్రేమ 
నేల రాలకుండా ఒడిసి పట్టుకునే సుగుణం ప్రేమ 

సాగరాల కళ్ళల్లో తలుక్కున మెరిసే ముత్యం 
హృదయ లోతుల్లో కనులు ముందు జరిగే సత్యం 

హృదయ స్పందన మనసున తాకే మత్తు మైకం
రెండు అక్షరాల కలయిక బంధమే ప్రేమ నమ్మకం 

గుండె లోతుల్లో రహస్యంగా పదిలంగా దాగే బంధం 
గుండె పొరల్లో పునాది కట్టే నమ్మకమే దాని ఆయుధం 

కుమ్మరించే ప్రేమ చిహ్నమై హృదయ ఆకారం
ఆప్యాయత అనురాగాల భద్రత బాంధవ్యాల రూపం

ప్రపంచంలో ప్రేమ అనంతమై చరిత్ర సృష్టించే
పంచే ప్రేమ కోటి జీవాల బంధాలతో మమైక్యమే 

విఫలమైనప్పుడు రెప్పపాటులో ఇక అదృశ్యమే 
గుప్పెడంత ప్రేమ చూపితే హృదయానికి మరి చేరువే

బరువెక్కిన గుండెకు భరోసా తానై సేద తీర్చే 
బంధాలతో బాధ్యత ఎరిగి తోడు నీడై ప్రవర్తించే

ఒంటరిగా ఉన్నప్పుడు నేనున్నానంటూ తోడై వచ్చేది 
కష్టసుఖాలలో తాను ఎప్పుడు చేయూతై పంచుకునేది

మనం వెతుక్కుంటూ వెళ్లే ప్రేమ కన్నా
మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమే మిన్నా.
                         
                           

కామెంట్‌లు