తొలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు,తొలి భారతీయ మహిళాగవర్నర్,అన్నిటా పైచేయి,కవయిత్రి రచయిత్రి సరోజినీ నాయుడు.బెంగాలీ భామ ఆరోజుల్లో ప్రేమవివాహం కులాంతర తెలుగువాడైన ముత్యాల గోవిందరాజు నాయుడిని పెళ్లాడింది.కందుకూరి వీరేశలింగం పంతులుగారు దానికి ప్రధాన సూత్రధారి.తల్లిదండ్రులు వరదసుందరీదేవి అఘోరనాధ చటోపాధ్యాయ. బాల్యం నుంచి చురుకు అఖండ తెలివితేటలు ఆమె సొత్తు.12వ ఏటనే మెట్రిక్ పాసై విదేశాల్లో చదువుతో పాటు ఆంగ్లంలో కవితలు రాసి మెప్పు పొందింది.13వ ఏటనే 1300లైన్ల కవితరాసిన ప్రతిభాశాలి.స్త్రీ జాతికి వన్నెలద్దిన కమ్మని పూలరెమ్మ నైటింగేల్ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధిగాంచిన భారతకోకిల సరోజినీ నాయుడు.పల్లకీ బోయీలు గోల్డెన్ త్రెషోల్డు, గాజులబేహారీ పాటలు ప్రసిద్ధిగాంచిన తెలుగు అనువాద గీతాలు.ఆమె హైదరాబాద్ లో పుట్టిన మెట్టిన కుందనపు బొమ్మ. గాంధీజీని మిక్కీమౌస్ అంటూ ఆటపట్టించి గలగల నవ్వేది. పెద్ద బొట్టు,పట్టుచీర కట్టు,నిండైన విగ్రహం,ఆగ్రహంలేని కళకళలాడే వికసిత సరోజం శ్రీమతి సరోజినీ నాయుడు దేశానికే మణిదీపం🌷
సరోజినీ నాయుడు:- చినిమిల్లి విజయలక్ష్మి విశ్రాంత ప్రధానోపాధ్యాయిని
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి