కాలం కలిపిన బంధం నాన్న (అందెశ్రీ);- నాగలక్ష్మి కుంజ - భద్రాచలం
బాల్యంలో అక్షరం ముక్క తెలియని నిరక్షరాసి 
బ్రతుకు జీవనంలో జీతం ఎరుగని పశువుల కాపరి 
భవననిర్మాణంలో బ్రతుకు జీవనాధారమే తాపీ మేస్త్రి
కాలం కలగన్న అందే శ్రీ ప్రజాకవి ప్రకృతికవి లోకకవి 

ఏ జన్మ బంధమో కాలం కలిపిన ఆత్మీయ బంధం 
ఏ జన్మ సంబంధమో కాలం కలగన్న పితృ బంధం
ఈ జన్మ రుణమే ఆమితమైన ఆప్యాయత అనురాగం
ఈ జన్మ బంధమే ప్రకృతి చూపిన ప్రేమ అనుబంధం

తనదైన శైలిలో కన్నతల్లిలా అమ్మల్లె అనురాగం 
తనదైన శైలిలో కన్న తండ్రిలా తన ప్రేమ వాత్సల్యం
అరుదైన వ్యక్తి వ్యక్తిత్వంతో నాటిన ప్రకృతి బంధం
ప్రకృతిలో రక్తసంబంధమే పరిమళించిన మట్టి బంధం

హృదయ స్పందన అణువణువున తన ప్రతిరూపమే 
హృదయం నలిగిన కష్టాల వెనుక తన ప్రతిబింబమే
నాన్న ప్రేమ బాధ్యతలకి "బిడ్డ "ఆ పిలుపు మాధుర్యమే
అందే శ్రీ తండ్రిగా అందిన గొప్ప వరమే నాకు అదృష్టమే

పాటకు ప్రాణం పెట్టిన గిరిజన బిడ్డ పాట బంధమే
నదుల ప్రవాహంలో కొట్టుకెళ్లిన తన అక్షరాల ధారా
భద్రాచలం గోదావరిలో నడిచే పర్ణశాలలో చేరే ధార
పుష్కరాలలో ప్రవహించి నా శిరసున చేరిందేమో..

నాన్న అంటూ కలలు కన్నా రక్తసంబంధమే
అందెశ్రీ  తన రక్తం ధారపోసి పుట్టకపోయినా సరే నేర్చిన,
 నేర్వని అక్షరం ముక్క కలిపిన అనుబంధమే 
పయనిస్తున్న కాలానికి ఎదురైనా మట్టి బంధమే

ఎన్నో సముద్రాలను తాకిన ఆ కరములు స్పర్శ 
నా మస్తిష్కానికి దీవెనలు అందిస్తుంటే పులకించిపోయా
"నాన్న, నా బిడ్డ "అంటూ పిలికే పదాలే మైమరిచిపోయే
చిందించే చిరునవ్వే నాకు నిత్య అభరణమే

గుర్తు రాని రోజు అంటూ అసలు లేదు రాదు 
గురుతులన్నీ గుండె లోతుల్లో పునాది వేసే
బిడ్డ అనే పిలుపుకు ఎదుర్కొనే కష్టాలనే మరిచే
పసితనంలో నాన్న లేని లోటును తీర్చినా బంధమే.

                                   

కామెంట్‌లు