వైద్యులు: - డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం.
వైద్యులు 
బుద్ధులు-బోధించాలి.!!
వైద్యులు 
రోగాన్ని నిర్ధారించాలి 
నిరోధించాలి 
చికిత్స చేయాలి.!!

వైద్యులు 
సామాజిక యోధులు 
సామాజిక రుగ్మతలపై 
వైద్యులు గెలవాలి. 

రోగికి వైద్యునికి మధ్య 
వ్యాపారం కాదు 
స్నేహముండాలి. 
రోగికి వైద్యునికి మధ్య 
వ్యాపారం కాదు 
సేవాభావముండాలి. 
రోగికి వైద్యునికి మధ్య 
డబ్బు సంబంధం కాదు 
రక్తసంబంధం లా ఉండాలి. 

మొత్తంగా వైద్యుడు 
అమ్మలా ఉండాలి. 

వైద్య వృత్తి 
ఉపాధ్యాయ వృత్తి కన్నా 
గొప్పది కావాలి.!!?

వైద్యుడు ఉపాధ్యాయుడు 
దేవుడు 
అందరిచే పూజింపబడతారు.!!?

నాగర్ కర్నూల్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాదేవి గారి స్ఫూర్తితో. 

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం.

కామెంట్‌లు