ఇంద్ర జాల మహేంద్ర జాల ముల మించి పోయె మానవ జాలము లీనాటికి...!
అసాధ్య ముల నెన్నొ...
సు సాధ్యములు గా విం చు చున్నారు గదా...!!
మనిషి దలచు కున్న, చేయ లేని దేమున్నదీ జగాన...!
ఓ మనిషి...!
నీ వింత జ్ఞాన, విజ్ఞాన, ప్ర జ్ఞాన సమర్ధుడవే....
సు జ్ఞానివి కాలేక పోతు న్నావెందుకు....!?
నీ ఈ అజ్ఞాన ప్రదర్శణ లే మిటి...?!
నీ కీ లోభత్వ మెటులబ్బె
స్వార్ధమెటనుండివచ్చె!?!
ఈ దోపిడీలు దౌర్జణ్యము లెందుకు...!
ఇంతింత హింస, రక్తపాతాలా...!!
ఇక్కడ ఏదీ నీతో రాదని తెలిసి తెలిసి...
ఈ తాపత్రయములేల..!?
నవ్వి... నవ్వించ లేకున్నా వేల...?!
ఇతరులను ఆనందింప జేయటంలోనే ...
మన ఆనంద ముంటు0 దన్న సత్యము నీకేల స్పృ శించలేదు...!?
సుఖాల నాశిస్తావు , దుఃఖ కారక క్రియలనే చేస్తున్నావు...!
ఈ అజ్ఞానపు మిడి మిడి జ్ఞానాన్ని విదిలించుకో... వదిలించుకో...!!
సుజ్ఞానపు ఆనందార్ణవం లో... సంతోషపు జలకా లాడవోయ్...!
జ్ఞాన మంటే... పూర్ణానం దమే నోయి...!!
ఈ స్వచ్చమైన ఆనందమే లేకుంటే...
నీ వెంత విజ్ఞనివైనా....
ఎంత గొప్ప ప్రజ్ఞను ప్రద ర్షించినా....
నిష్ప్రయోజనమే...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి