వన పర్వము షష్టమాశ్వాసము: 132 వ రోజు
కర్ణుడు సుయోధనుడిని ఓదార్చుట
సుయోధనుడు పక్కనే ఉన్న దుశ్శాసనిని చూసి " దుశ్శాసనా! నీకు రాజ్యాభిషేకం చేస్తాను. శకుని , కర్ణుల సాయంతో ఈ భూమండలం ఏలుకుంటూ నీ తమ్ములకు సంతోషం కలిగించు. బ్రాహ్మణును సన్మానించుతూ, గురువులను భక్తితో పూజిస్తూ ప్రజలను పాలించు " అన్నాడు. ఇది విన్న దుశ్శాసనుడు తల్లడిల్లి పోయి " అన్నా! భూమి బద్ధలైనా, సముద్రాలన్నీ ఇంకిపోయినా, సూర్యచంద్రులు తేజమును కోల్పోయినా నీవే సార్వభౌముడవు. నేను ఈ రాజ్యభారాన్ని భరించ లేను " అంటూ ఏడవసాగాడు. కర్ణుడు వారిరువురుని చూసి " సుయోధనా! మీరిరువురు శోకమును విడువండి. ఈ విధంగా శోకించిన శత్రువులు సంతోషిస్తారు. చంద్రవంశపు రాజువు ఇలా అల్పునిలా దుఃఖించ తగునా. ఎన్నో భోగములు అనుభవించ వలసిన ఈ శరీరమును ఇలా త్యజిస్తావా. నీవే ధైర్యం కోల్పోయిన మమ్ములను ఎవరు ఓదారుస్తారు. నువ్వు పాండవుల వలన విముక్తుడవైనావని దుఃఖిస్తున్నావు కాని అది సరి కాదు. ఏ రాజ్యంలో పౌరులు నిశ్చింతగా జీవిస్తున్నారో వారు ఆ రాజుకు సేవకులు. ఆ రాజు ఆపదలో ఉన్నప్పుడు పౌరులు తమ శౌర్యంతో అతనిని రక్షించాలి. పాండవులు నీ రాజ్యంలో నివసిస్తున్న నీ కింకరులు. ఆపదలో ఉన్న నిన్ను రక్షించుట వారి ధర్మం. పాండవులు జూదంలో సర్వమూ పోగొట్టుకుని నీకు దాసులైన వారు. ఈ మాత్రం చేయడంలో వారి గొప్ప ఏమున్నది " అన్నాడు.
శకుని సుయోధనుడికి హితవు చెప్పుట
శకుని దుర్యోధనుని చూసి " సుయోధనా! కర్ణుని మాటలు విని నీ దుఃఖము విడువుము. నేను పాండవుల రాజ్యం నీకు కట్టబెట్టాను. నీ పరాక్రమంతో సాధించినవి కాదు. కనుక నీవు ప్రాయోపవేశం చేసిన నా మనసుకు బాధ కలుగుతుంది. చిన్నపటి నుండి సిరి సంపదలతో పెరిగావు. పెద్దలకు సేవ చేయలేదు కనుక నీకు లోకజ్ఞానం లేదు. రాజుకు పిరికితనం, ఏమరుపాటుతనం, మెతకతనం ఉండరాదు. మనసు వికలమైనప్పుడు, కోపం వచ్చినప్పుడు వాటిని అంతమొందించాలి. నీకు మేలు చేసిన పాండవులకు ప్రత్యుపకారం చెయ్యి. పరాక్రమవంతులు, ధర్మాత్ములు, సద్గుణసంపన్నులైన పాండవులను పిలిచి తగు సత్కారం చేసి వారి రాజ్యం వారికి ఇచ్చిన నీకు ఎనలేని కీర్తి కలుగుతుంది. నీ సోదరులైన పాండవులతో రాజ్యపాలన చేస్తూ అందరూ సంతోషంగా ఉండండి " అన్నాడు. దుర్యోధనుడు " మీరు నన్ను అడ్డగించ వద్దు. నాకు ఈ భోగభాగ్యాలపై ఆసక్తి లేదు. నాకు అడ్డు చెప్పక మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి " అన్నాడు. వారు " నీవు తప్ప మాకు ఎవ్వరు ఉన్నారు . మేము నీతో సహగమనం చేస్తాం " అన్నారు. దుర్యోధనుడు శుచిగా స్నానమాచరించి దర్భాసనంపై కూర్చున్నాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి