భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా
వసుదైకానికే నిలిచిన మన పండుగలు ఆచారాలు
శాస్త్ర దృక్పధానికి వేల సంవత్సరాల క్రితమే ఆదర్శం.
బాల్యంలో అమ్మమ్మ తాతయ్యల
అమ్మ నాన్నలు చెప్పే నీతికథలు రామాయణ, భారత గ్రంధాలు
వేదాలే ప్రామాణికంగా జరిగే వివిధ క్రతువులు
వినాయక, శరన్నవరాత్రులు
శ్రీకృష్ణాష్టమి వేడుకలు
శ్రీరామనవమి ఉత్సవాలు
రంగుల హేళి హొలీ వేడుకలు
దీపావళి వేడుకలు శివరాత్రి ఉపవాస జాగరణ లు
సోదర సోదరీమణుల బంధాన్ని తెలిపే రక్షాబంధన్
గోకులాష్టమి గోమాత పూజ
విభిన్న దేవాలయాలలో జరిగే బ్రహ్మోత్సవ వేడుకలు
దేవాలయ శిల్ప సంపద
గ్రామదేవతల పండుగలు
బతుకమ్మ ,బోనాల పండుగలు
ఎన్నని, ఏమని చెప్పను కులాల కతీతంగా జరిగే వేడుకలైన
మన సంస్కృతి సాంప్రదాయాలు వసుదైకానికే ఆదర్శం
వాటిని పరిరక్షణ చేసి
భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం...!!
....................
సంస్కృతి.. సాంప్రదాయాలు: - కవి మిత్ర, సాహిత్య రత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖ పట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి