వేధించు చింతలను
చీకటితో చేరిపేసి
శోధించి సాధించు
ఆలోచనలకు అవకాశమిచ్చే...
వేకువ
చిన్నబోయిన మదికి
చిన్న ఊరటగా...
మూతపడని రెప్పలకు
కొత్త వెలుగులు తెచ్చే
వేకువ
తల్లడిల్లు మనసున
తారాడు తలపులతో
కలత నిదుర లోన
కలల రూపాన్ని కనిపింప చేసే
వేకువ
తప్పు చేయని మనసును
తక్కువ చేసిన వేదనలో
తలవిదిలించి తపనతో
తానేమిటో చూపే చొరవ నిచ్చే
వేకువ
నిక్షిప్తమైన ఆలోచనలకు
నిర్దిష్టమైన రూపమిచ్చి
నిశ్శబ్దంగా నడిపించు
నిర్ణయం తీసుకునే తొలి
వేకువ
అంతర్మధనము తరువాత
అంధకారము తొలగి
అంతరంగము నిండా
అంతులేని నమ్మకం కలిగించు
వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి