ఓప్రసిద్ధ జర్నలిస్టు, ఆకాశ వాణిలో గళం విప్పిన శ్రీ ఉడతా రామకృష్ణ జీవితం నల్లేరుపై బండి కాదు. ఆయన బాల్యం యవ్వనం సంకుల సమరం అనే చెప్పాలి.కృష్ణాజిల్లాలోని గొల్లనపల్లి గ్రామంలో ఉడతా వెంకటేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులకు 2.2.1961లో జన్మించారు. ఈయన 5వ ఏటనే తండ్రి చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతే, బాల్యం అంతా కష్టాలలో గడిచింది. ఆ తండ్రి 1966 లో వెళ్లిపోయిన ఆయన తిరిగి 1982 లో రావటం మరవలేని జ్ఞాపకం. ఐనా తండ్రిని ఆదరించి అక్కున చేర్చుకున్న రామకృష్ణ, ఆయన తల్లిని మనం అభినందించి తీరాల్సిందే! నిజంగా ఇది నమ్మలేని నిజం! కన్నతల్లి అండదండలతో రామకృష్ణ ఎస్.ఎస్.సి. చదివి పేదరికం, కుటుంబ పోషణ కై చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి కులవృత్తి ఐన మగ్గంపై చేనేత వస్త్ర తయారీలో నిమగ్నమైనారు 1975_1988దాకా వస్త్రాల నేతలో బిజీగా ఉంటూ రేడియోతో అనుబంధం పెంచుకున్నారు. ఏకధాటిగా 10_12 గంటలు నేత పని లో చెమట ఓడ్చిన 15 ఏళ్ల కుర్రాడు చెవిని రేడియోకి అప్పగించి శ్రమను మర్చిపోయే ప్రయత్నం చేశాడు. అలా మగ్గం నేతతో కలం గళం విప్పి ఆకాశవాణి విజయవాడకు లేఖలు రాయటం ఆరంభించాడు.6వక్లాసులో ఉండగానే పేపర్ చదివేవారు.ఆరోజుల్లో ఆంధ్రప్రభ డైలీ పేపర్ అందరికీ ప్రియమైన పేపర్.సోషల్ స్టడీస్ సార్ రోజూ పేపర్ చదవమని ప్రోత్సాహించటంతో చిన్నారి రామకృష్ణ పొరుగున ఉన్న వారింటికెళ్లి పేపర్ తెచ్చుకుని చదివేవారు.రాజకీయ విశేషాలు,పార్లమెంట్ అసెంబ్లీ కార్యకలాపాలపై ఆసక్తికనపరుస్తూ ఓవిలేఖరిగా బాల్యంలోనే తనకుతానే ఓ గమ్యం కి రాజబాట వేసుకున్నారు.తక్కువ చదువైనా పాత్రికేయునిగా ఎదిగారు.కిరాణా కొట్టు వారి సరుకుల కాగితాల పొట్లాంని విప్పి చదవడం లో థ్రిల్ బాల్యంలోనే రుచిచూసిన రామకృష్ణ అలా అలా సాహిత్యంతో దోస్తీ కట్టారు.రోజూ 10_12గంటలు నేతపని చేస్తూ రేడియో వింటూ అలసట పోగొట్టుకొన్న రోజులవి. నేతపని చేస్తూ రేడియో శ్రోత గా లేఖలు రాస్తూ ఆఖరికి పాత్రికేయునిగా నిల్చిన ఆయన జీవితం నేటి విద్యార్థులకు ఆదర్శంసుమా🌹
మట్టిలో మాణిక్యం ఉడతా రామకృష్ణ : - సేకరణ... అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి