మాతృభాష కళామతల్లి
నీకు వందనం !
పాదాభివందనం !!
అమ్మ తెలుగు భాష కళామతల్లి......
తరతరాల నుండి మా నరనరాల్లో......
అన్య భాషలు జీర్ణించుకుపోయినాయి.
మాతృభాషపై మమకారం మందగించి.....
ఆంగ్ల భాషలపై మోజు పెంచుకున్నాం.
అయినా...
మాతృభాషా దినోత్సవం
ఘనంగా జరుపుకుంటున్నాం.
కవులు నీపై కమ్మని
కవిత్వాన్ని వ్రాస్తున్నారు.
గాయకులు నీపై రమ్యమైన
గేయాలు ఆలపిస్తున్నారు.
పండితులు నీ పైన పద్య
కుసుమాలు వెదజల్లుతున్నారు.
రచయితలు రమ్య శైలిలో
రచనలు చేస్తున్నారు.
ఉపన్యాసకులు తెలుగు భాష పై
అనర్గళంగా ఉపన్యసిస్తున్నారు.
మేధావులు , భాష శాస్త్రవేత్తలు,
కవి పండిత గేయకులు
అందరూ నిన్ను కీర్తిస్తున్నారు
నీ భాష వైభవాన్ని శ్లాఘిస్తున్నారు
నీకేం తల్లి.....!
నిత్య సౌభాగ్యవతివి.
నిర్మల మతివి.
తెలుగు ప్రాచీన భాషగా
హోదా పొందిన దానివి.
ఇంతలో......
నీకేమైంది తల్లీ ....! ?
హఠాత్తుగా కొందరు.....
తెలుగు భాషను రక్షించుకుందాం !
తెలుగు భాషను బ్రతికించుకుందాం !!
తెలుగు భాషను కాపాడుకుందాం
అంటున్నారు.... అరుస్తున్నారు.
వాళ్లకేం తెలుసు.....!?
"నీకు జననం తప్ప
మరణం లేదు"
ఓ భాషా కళమా తల్లీ
పరభాష సంకెళ్లు తొలిగేదేప్పుడో ...!?
మధురమైన తెలుగు సంపదను.....
తెలుగుజాతి గుండెల్లో....
నిండుగా నిన్ను కీర్తించి
మంగళ హారతులెత్తేదెప్పుడో...!!
పరిపాలనా వ్యవస్థలో
మార్పు వచ్చినప్పుడు....
తెలుగు భాష అమలైనప్పుడు
నీకు క్షీరాభిషేకం...
ఆనాడే....పట్టాభిషేకం.
------------------------------------
" సాహితీ శిరోమణి "
" కవన సాగర "
" సాహితీ ధురీణ"
92473133488
హయత్ నగర్
హైదరాబాదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి