పాలమబ్బుల పల్లకి ఎక్కి
నీలి నింగిని సాగివస్తూ...
తెలిమంచు తెరలు తీస్తూ
తొలి వెలుగులు పంచుతూ...
ఏటి వాలున నీటి పైన
మేటి జలతారు కొంగులా
కోటిదివ్వెలు వెలుగు తీరున
నేటి కాంతులు పరచుకుంటూ....
మగత నిదురలో హాయిగా
మునిగి మురిసే జగతికి
సూదిగుచ్చే లేత ఎండతో
మేలుకొలుపులు పాడుతూ..
తనరాక కంటే ముందే లేచి
తమ బాధ్యత నిర్వర్తించే
తరుణుల కదలికలు చూసి
తరణి తబ్బిబ్బై నిలిచిపోడా!
ఆగని పరుగుల ఒత్తిడిలో
ఆశలు తీరని చిత్తడిలో
అలుపే లేక అరుగుతున్న
అందరి బ్రతుకులు చూసి....
సకలమూ సలలితముగా
సర్వులూ సలక్షణముగా
సత్యముగా సహకరించుకునే
సహృదయభావనలు సంవర్ధిల్లాలని
సర్వహితము కోరే సర్వాత్మకునికి
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి