సామెత -150:-అమ్మ బోతే అడివి- కొనబోతే కొరివి
*****
నేనీ ఎగసాయం శెయ్యనే అంటే ఇన్నావు గాదు.మనం ఒకల కింద పన్జేయడమేంది. మనమే నల్గురికి పెట్టేటోళ్ళమని ఉబ్బిచ్చి ఊరిచ్చి నాయినతో ఎగ సాయానికి పంపినవు. గిప్పుడు పతేట నట్టమే వత్తున్నది. పైస దాసుకునుడేమో గని కూలోల్లకు మందు కట్టలకు వేలకేలు పెట్టుబడి పెట్టాల్సి వత్తోందని" పొద్దున లేత్తే నాతో పంచాతి చేత్తాండవ్వా!"
"ఉన్నొక్క కొడుకు ఉజ్జోగమన్కుంట ఊళ్ళు బట్కోని తిర్గుతుంటే మా గతి ఏం గావాలే. గందుకే గాన్ని కాళ్ళా ఏళ్ళా బడి ఒప్పిచ్చి ఎగసాయంల బెట్టిన. కాలం గిట్ల పగబడ్తదని కలగన్ననా? నువ్వే సెప్పవ్వా!
"నువ్వన్న దాంట్లె తప్పేం లేదు శెల్లె! కాలం గిట్ల మారిందంటె మనమే బాద్దులం. అడవుల్ని నరికి,ఇండ్ల కోసం ఊల్లెల్ల శెట్లను నరికి ఎటు సూశినా ఎడారి జేశినం. గప్పన్నించే కాలంల శానా తేడాలొచ్చినయి. బూవి అగ్గి గుండమైంది. ఆనాకాలం లేదు, సలికాలం లేదు. మొత్తం ఎండాకాలమే అయ్యింది. సముద్రంల ఆయు గుండాలొచ్చి ఆనలు కుర్సుడు తప్ప మామూల్గ కుర్సుడే పోయింది.
గిట్ల కాలాలు మారుడు వల్ల అందరికంటే ముందుగాల ఎగసాయం సేశే రైతే అవత్త పడుతుండు. పంట శేతికొత్తుందని సంబుర పడేటేల కుంబవుట్టి ఆన కురిసి పంటను నీళ్ళ పాలు శేత్తుంది.
గట్ల కాకుంటేనేమో సయిమానికి ఆనలు కుర్వక ఏసిన పంట ఎండిపోయేకాడికొత్తుంది. గట్లుండే తల్కి ఎన్కటోళ్ళు తప్ప గిప్పటోళ్ళు గీ పంటలైపు కన్నెత్తి సూట్టానికి సుత ఇట్టపడట్లే శెల్లె. గా రైతులు సుత తమ పిల్లగాండ్లను గిండ్లకి రానియ్యకుండా ఏదో ఒక బత్కు తెరువు సూస్కోని అనుకుంటుర్రు.
మరెట్లవ్వా! పజలు బత్కాలంటే గీ రైతులు పండిత్తెనే గద.అందర్కి యాన్నించొత్తయి ఉజ్జోగాలు.
"అవును శెల్లె నువ్వు శెప్పింది నిజవే. గా యిషయంల నీకు నాకు సోయి వుంది గని శానామందికి లేదాయె".
"గిట్ల రైతులు పండిత్తెనే ఆళ్ళ బత్కులు అని తెల్సుకోనంత కాలం మన బత్కులు గిట్లనే తెల్లారుడు శెల్లె.
"గీ దీన్కి తోడు రెక్కలు ముక్కలు జేస్కొని పండించిన పంటను అమ్ముకునేందుకు బోతే అడివి లెక్క రేటు బలకదు. మల్ల గీ రైతే అంగట్లకు బోయి కొందామన్కుంటే సుక్కల్నంటే దరలు. ఎటూ బడి రైతే నట్ట బోతుండు శెల్లే!"
"గందుల్లనే గీ తడ్సిన పంటల్ల మిర్పకాయలు, పత్తి,వొడ్లను ఆరబెట్టి అమ్ముదామంటే సేశిన కట్టమంత సుత లాబం లేకపాయె. గట్లనే యిత్తనాలు, ఎరువులు కొందమంటే మత్తు పైసలు అయితుండె. గందుకే మీ వోడు గట్ల శికాకు జేత్తుండు శెల్లె.
"మరెట్లవ్వా? దీనికి దారే లేదా?
"అమ్మ బోతే అడివి కొనబోతే కొరివి అన్న" మాట మారేంత వరకు గిట్లనే బాద పడ్కుంట ఉండుడే.
"గందుకనే రైతులంత ఒక్క మాట మీద నిల్వాలే.గాళ్ళ పంటను గాల్లే నడ్మ దలారోళ్ళు లేకుండ అమ్ముకోవాలె. గప్పుడు కొంతన్న రైతులకి లాబం జరుగుద్ది.
గిప్పుడు పంటలు పండిచ్చే సన్న శిన్నకారు రైతులు ఏకం కావాలె శెల్లె. గీల్లే కాదు బొమ్మలు తయారు జేసేటోళ్ళు, బట్టలు నేశేటోళ్ళు, గిట్ల రకరకాల వత్తువులు తయారు జేసేటోళ్ళు శేతి వుత్తులోల్లు కల్సికట్టుగ వుంటే గిస్మంటి బాదలు శానా శానా తొల్గుతయి.
"గా దైర్నం మాటలు మా వోడికి శెప్పవ్వా! తీసుకొత్త" అన్కుంట బోయింది లచ్చుమమ్మ.
గిదండీ సంగతి "అమ్మ బోతే అడివి కొనబోతే కొరివి" అంటే గిదే మరి. గిట్ల రైతులు, వుత్తి పనోళ్ళు సుత ఏకమై గీ దీన్ని తారుమారు చేశేందుకు పయత్నం జెయ్యాలె.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి